రాంపల్లి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

రాంపల్లి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని గల రాంపల్లి గ్రామం నందు వ్యవసాయ శాఖ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని గురువారం రోజున నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “పొలం పిలుస్తుంది” అనే కార్యక్రమంలో భాగంగా రాంపల్లి గ్రామం రామిరెడ్డి అనే రైతు పొలంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.రైతులకు నాణ్యమైన విత్తనాలు,పురుగు మందు ఎలా వినియోగించుకోవాలో తదితర అనేక విషయాలు రైతులకు వ్యవసాయ అధికారులు తెలియజేశారు.అనంతరం మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు మాట్లాడుతూ అధిక దిగుబడి వచ్చే విధంగా సలహాలను వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తెలియజేయాలని ఆయన తెలియజేశారు.రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను మరియు సలహాలను పాటించి తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులను సాధించే విధంగా రైతులు ముందుకు సాగాలని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ చైతన్య,ఎంపీఈఓ అజారుద్దీన్,విహెచ్ఎ రవితేజ,ప్రకృతి వ్యవసాయ స్టాప్ లింగప్ప,గ్రామ రైతులు బొల్లా చంద్రశేఖర్ రెడ్డి,నాగిరెడ్డి,మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, రంగనాయకులు,చిన్న హానుమంతు, మొట్టి హానుమంతు,గౌలి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!