
అప్పుల బాధతో రైతన్న మృతి
న్యూస్. వెలుగు, ఒంటిమిట్ట; కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం గంగ పేరూరు గ్రామంలో నివసిస్తున్న దూళ్ల.సుబ్బారెడ్డి అనే రైతు సోమవారం మధ్యాహ్నం 12: 25 నిమిషములకు హాస్పిటల్లో మృతి చెందినట్లు ఈ మేరకు మృతుని భార్య సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గంగ పేరూరు గ్రామానికి చెందిన దూళ్ల. సుబ్బారెడ్డి అనే రైతు పొలాన్ని కౌలుకు తీసుకుని అప్పుచేసి పంటలు వేయడం జరిగిందని పంట సకాలంలో చేతికి రాకపోవడంతో నష్టపోయి పంటకు పెట్టిన ఖర్చు కూడా చేతికి రాకపోవడంతో అప్పుల బాధ తట్టుకోలేక ఈనెల 4వ తేదీన రాత్రి 9:00 గంటల సమయంలో మృతుడు పురుగుల మందు తాగడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబీకులు వైద్యశాలకు తీసుకుపోవడంతో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం12:25 గంటలకు మృతి చెందడం జరిగిందని మృతుని భార్య తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఒంటిమిట్ట సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ తెలిపారు. తమ దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సిందని తెలిపారు.