శనగ పంట సాగు చేసిన రైతులు అప్రమత్తంగా ఉండాలి
పొలాల్లో నీరు నిలబడకుండా నీరు బయటకు పోయేందుకు మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి..
మండల వ్యవసాయ అధికారి మా రెడ్డి వెంకట కృష్ణారెడ్డి
ముద్దనూరు, న్యూస్ వెలుగు; ముద్దనూరు మండలంలోని శనగ పంట సాగు చేసిన రైతులు పొలాల్లో మురుగు నీరు నిలబడకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి మారెడ్డి.వెంకట క్రిష్ణారెడ్డి రైతులకు సూచించారు.శనగ పంటలో నీరు నిలబడితే వేరు కుళ్లి పోయి మొక్కలు చనిపోతాయి.కావున రైతులు పల్లపు(తగ్గు) ప్రాంతంలో నీరు నిలబడకుండా ప్రతి ఒక్కరు మురుగు కాలువలు తీసి నీరు బయటకు పంపాలి అని సూచించారు.శనగ పంట సున్నితముగా ఉంటుంది అని కావున అధికారుల సూచనలు పాటించాలి అని తెలిపారు.భూమి లో తేమ ఆరిన తర్వాత 19.19.19. అనే నీటిలో కరిగే ఎరువును లీటరు నీటికి 10 గ్రాములు లేదా యూరియా 20 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని కోరారు.నిన్న కురిసిన వర్షం ఈ రోజు ఉదయం వరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 14.2MM వర్షపాతం పడింది అని తెలిపారు.రైతులకు ఈ వర్షంతో ఎంతో ఊరట కలిగి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉందని తెలిపారు.ఏది ఏమైనా సకాలంలో మంచి వర్షం రావడం వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.