
రోడ్డు ప్రమాదంలో మహిళా పోలీస్ కు తీవ్ర గాయాలు
తుగ్గలి న్యూస్ వెలుగు : పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామ సచివాలయం మహిళా పోలీస్ త్రివేణి కు బుధవారం ఉదయం తుగ్గలి మండలం గిరిగెట్ల గ్రామం వద్ద ద్విచక్ర వాహన ప్రమాదంతో తీవ్ర గాయాలు గురయ్యారు. దీంతో స్థానికులు ఆమెను 108 లో వాహనంలో పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బుధవారం ఉదయం పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉండగా ఆమె ఒక సచివాలయ ఉద్యోగి ద్విచక్ర వాహనంపై చిన్నహుల్తి కు వెళుతుండగా గిరిగేట్ల వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు . దీంతో తుగ్గలి లో ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం 108 వాహనంలో మెరుగైన చికిత్స కోసం పత్తికొండకు తరలించారు. గతంలో ఈమె గిరి గేట్ల సచివాలయంలో మహిళా పోలీస్ గా విధులు నిర్వహించి చిన్నహుల్తికి బదిలీపై వెళ్లారు.
Was this helpful?
Thanks for your feedback!

