
ఎల్లార్తి జిల్లా పరిషత్ కన్నడ ఉన్నత పాఠశాలలో తొలి కాంప్లెక్స్ మీటింగ్
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలోని ఎల్లార్తి గ్రామంలో జిల్లా పరిషత్ కన్నడ ఉన్నత పాఠశాల నందు శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో తొలి కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లార్తి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ 14 పాఠశాల ఉపాధ్యాయులు హాజరవుతారని మరియు 14 పాఠశాలకు కేంద్ర బిందువు ఎల్లార్తి స్కూల్ కాంప్లెక్స్ ఎల్లార్తి స్కూల్ ఎంపిక కావడం వల్ల పాఠశాల అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు.అన్ని తరగతులకు ఉపాధ్యాయులు పోస్టులు మంజూరు అవుతాయన్నారు.అనంతరం వైకాపా జిల్లా ఉపాధ్యాయక్షులు గిరి మాట్లాడుతూ ఎల్లార్తి జిల్లా పరిషత్ కన్నడ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ గా ఎంపిక చేసినందుకు జిల్లా విద్య అధికారి,మండల విద్య అధికారులకు,ఉపాధ్యాయులు కు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్లు లక్ష్మీకాంత్,ఉపాధ్యాయులు వెంకటేష్,జిలాన్,రవీంద్ర,అన్ని పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.