
దోమల నివారణకు ఫాగింగ్
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శుక్రవారం సర్పంచ్ చలువాది రంగమ్మ ఆధ్వర్యంలో గ్రామంలో దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టినట్లు కార్యదర్శి రాజశేఖర్,సర్పంచ్ తనయుడు పంపాపతి తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి కాలనీల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేపడుతామని చెప్పారు.మరియు ప్రజలు కూడా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమ కాటుకు గురి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Was this helpful?
Thanks for your feedback!