దోమల నివారణకు ఫాగింగ్

దోమల నివారణకు ఫాగింగ్

గెజ్జెహళ్లి సర్పంచ్ ఆరుబట్ల నాగమ్మ

హొళగుంద, న్యూస్ వెలుగు: కొద్దిరోజులుగా విపరీతంగా పెరిగిపోయిన దోమలను ఆదుపు చేయడం కోసం దోమల పై యుద్ధాన్ని ప్రకటిస్తూ శనివారం గేజ్జెహళ్లి గ్రామ సర్పంచ్ ఆరుబట్ల నాగమ్మ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన వీధులలో ఫాగింగ్ నిర్వహించారు.ముఖానికి మాస్కులు ధరించుకుని పొగ యంత్రం ద్వారా దట్టమైన పొగను దోమల పై వదులుతూ ఫాగింగ్ నిర్వహించారు.ఈ సందర్బంగా సర్పంచ్ తనయుడు గిరిమల్లప్ప మాట్లాడుతూ… గత కొద్దిరోజులుగా గ్రామంలో దోమలు అధికమయ్యాయని దోమల వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని దోమల అధికమైతే దోమల కాటు వల్ల ప్రజలకు రోగాలు బారిన పడతారని కాబట్టి మొదటిసారి కాకుండా రెండో సారి కూడా ఫాగింగ్ దోమలు నిర్మూలన కార్యక్రమం చేపట్టామని దీంతో దోమల పోటు తగ్గుతుందని ప్రజలు కూడా దోమల కాటుకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో దాసరి రాము, ఉప సర్పంచ్ అశోక్, గాదిలింగ,వీరేష్,తాయప్ప తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!