ఆహారమే ఔషధం” డాక్టర్ శంకర్

ఆహారమే ఔషధం” డాక్టర్ శంకర్

కర్నూలు, న్యూస్ వెలుగు;  ఫార్మకాలజీ విభాగాధి పతి, మాజీ రిజిస్ట్రార్,(NTR యునివర్సిటీ) గుంటూరు మెడికల్ కాలేజ్.. మారిన జీవనశైలిలో ఆహారం ను సరిగ్గా అర్థం చేసుకోవడంలేదని. అందువల్లనే మందుల పై పూర్తిగా అధారపడుతున్నారని అనేక రోగాలకు మూల కారణమ ఆహారం కూడా అని దానికి ఔషదం కూడా జీవనశైలి, ఆహారాన్ని బట్టే ఉంటుందని గుంటూరు మెడికల్ కాలేజీ ఫార్మసి విభాగాధిపతి డాక్టర్ శంకర్ అన్నారు. సోమవారం కర్నూలు మెడికల్ కాలేజీ యందలి ఓల్డ్ లెక్చరర్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన “జీవనశైలి మార్పులు-తక్కువ కార్బోహైడ్రేట్స్ ,ఎక్కువ ఆరోగ్యకర క్రొవ్వులు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్” అన్న అంశం పై సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ శంకర్ మాట్లాడుతూ మనం తీసుకునే ఆహారం అనేక రోగాలకు మూల కారణం అవుతుందని అదేవిధంగా ఆహారంలో మార్పులు చేసుకోవడం, జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా వాటిని సమర్థవంతంగా నివారించు కోవచ్చు ననితెలిపారు. తీసుకునే ఆహార విషయంలో అనేక అపోహలు ఆశాస్త్రీయ అంశాలు కొనసాగుతున్నాయని కార్బోహైడ్రేట్స్ తగ్గించాలని కోడిగుడ్డు ను పచ్చసొన తో సహా తీసుకోవాలని, అయిల్స్ లో ఉన్న వాటిలో కోకనట్ అయిల్ మంచిదని వెన్న , నెయ్యి మంచిదన్నారు. మిల్లెట్ డైట్ రోగాలకి వైద్యం కాదని ముందు జాగ్రత్త చర్యలు కోసం మాత్రమే ఉపయోగపడుతుందని తెలిపారు. ఉపవాసం విషయం లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కి చిట్టి నరసమ్మ మాట్లాడుతూ ఉరుకుల పరుగుల జీవితం ప్రజలు ఆహారానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని రోగాల విషయం లో ఆహారం ప్రముఖ పాత్ర అని అన్నారు. ఆహార విషయం లో శాస్త్రీయంగా నిరూపణ అయిన విధానాలే పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫార్మకాలజీ, కమ్యూనిటీ మెడిషన్, న్యురాలజి విభాగాదిపతులు డాక్టర్ రాజేష్, డాక్టర్ సుధా కుమారి డా . శ్రీనివాసులు, క్యాన్సర్ ఇనిస్ట్యూట్ డైరెక్టర్ డా.ప్రకాష్ , డా.దామం శ్రీనివాసులు వివిధ విభాగాల అధిపతులు అసోసియేట్లు అసిస్టెంట్ లు పీ.జీ లు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!