భారత్‌లోని కెనడా దౌత్యవేత్తకు విదేశాంగ సమన్లు..
ఢిల్లీ ; భారత్, కెనాలో మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. కెనడాలోని హైకమిషనర్‌తో పాటు ఇతర దౌత్యవేత్తలు, అధికారులను రీకాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కెనడాలో తీవ్రవాదం, హింసాత్మక వాతావరణంలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అక్కడి భారత దౌత్యవేత్తలు, అధికారుల భద్రతకు ప్రమాదం ఏర్పడిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఓ ప్రకటనలో పేర్కొంది. దాంతో కెనడా నుంచి హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించాలని భారతదేశం నిర్ణయించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ న్యూఢిల్లీలోని కెనడా దౌత్యేవేత్తకు సమన్లు జారీ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం ఏమాత్రం సరికాదని విదేశాంగశాఖ.. కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్‌కి స్పష్టం చేసింది. అయితే, ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో ఇటీవల భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మతో పాటు ఇతర దౌత్యవేత్తల పేర్లను అనుమానితులుగా చేర్చింది. కెనడా చర్యను విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలోనే భారత హైకమిషనర్‌తో పాటు దౌత్యవేత్తలను వెనక్కి పిలవాలని నిర్ణయించింది.