న్యూస్ వెలుగు తుగ్గలి :

తుగ్గలి మండల నూతన ఎంపీపీ గా ఎన్నికైన రాచపాటి రామాంజనమ్మ,వాలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ని , వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి ను మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం కర్నూలు లోని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి నివాసానికి శాలువాతో సన్మానించి గజమాల వేసి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ రామాంజినమ్మ,వాలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్షులు హనుమంతు లు మాట్లాడుతూ …తమపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించినందుకు పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ పదవి రావడానికి సహకరించిన తుగ్గలి మండలం నాయకులకు,కార్యకర్తలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
Thanks for your feedback!