టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎంపీలు..

టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎంపీలు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వరుసగా వైసీపీ కి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన ఇద్దరు మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ , బీద మస్తాన్‌రావు  టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు  సమక్షంలో బుధవారం రాత్రి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావుల పదవి కాలం ఇంకా ఉన్నప్పటికీ నెల రోజుల క్రితం ఆ పదవులకు రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరుతున్న విషయం స్పష్టం చేయనప్పటికీ ఈరోజు టీడీపీలో చేరారు. గతంలో వీరిద్దరూ టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఏపీలో అధికార మార్పిడి జరుగడంతో తిరిగి వారిద్దరూ సొంత గూటికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!