
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పి మురళీకృష్ణ
సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష గారి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం
మహిళలతో పోస్ట్ కార్డులపై సంతకాలు చేసి ఏపీ సీఎంకు పంపిన కాంగ్రెస్ నేతలు
తెలంగాణ, కర్ణాటకలో హామీ నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ
కర్నూలు, న్యూస్ వెలుగు; ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వెంటనే కల్పించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు పాలకమండలి మాజీ సభ్యులు పి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి వైయస్ షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం కర్నూలు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు షేక్ జిలాని భాష ఆధ్వర్యంలో జరిగిన పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి కొత్త బస్టాండ్ నుండి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన డిసిసి అధ్యక్షులు పి మురళీకృష్ణ గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో వచ్చి నాలుగు నెలలు అయినా ఉచిత బస్సు ప్రయాణంపై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదని రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉచిత ప్రయాణం ఎప్పుడు అని అడుగుతున్నారని, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వారంలో అమలు చేశామని కానీ మీకు మాత్రం పథకం అమలు చేయడానికి ఇబ్బందులు ఏమిటి ? రాష్ట్రంలో ప్రతి రోజూ 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని రోజు మహిళల ద్వారా రూ.7-10 కోట్లు అంటే నెలకు రూ.300 కోట్లు ఆదాయం వస్తుందని దాటవేస్తున్నారని ప్రశ్నించారు. ఉచిత ప్రయాణం కల్పిస్తే…ఈ రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుందని భయమా ?. మహిళల చేత ఓట్లు వేయించు కున్నారు. ఇప్పుడు మహిళల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేయలేరా ? మీ సూపర్ సిక్స్ హామీల్లో 4 పతకాలు మహిళలవే. ఇందులో ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటే తక్కువ ఖర్చు. ఇలాంటి తక్కువ ఖర్చు పథకం కూడా మీకు అమలు చేయడానికి ధైర్యం రావడం లేదా ఇదే అమలు చేయనప్పుడు ఇక పెద్ద పథకాల సంగతి ఏంటి అని ప్రశ్నించారు. 5 ఏళ్లు ఇలానే కాలయాపన చేస్తారా? ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు భద్రత ఉంటుందని మహిళలు ఆర్థిక ఉపశమనం పొందుతారని మురళీకృష్ణ డిమాండ్ చేశారు. అనంతరం కర్నూలు నగర కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చాలా మంచి పథకం అని చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నామని వెంటనే ఉచిత ప్రయాణం అమలు చేయాలని అలాగే సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని, మహిళలకు భద్రత విషయంలో ముందడుగు పడాలని ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాలని ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు పంపిస్తున్నామని రాబోయే రెండు మూడు రోజుల్లో పెద్ద ఎత్తన పోస్ట్ కార్డులు పంపిస్తామని ఇది చూసైనా ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని పోస్ట్ కార్డుల పై మహిళలతో సంతకాల సేకరణ చేసి సీఎం చంద్రబాబు నాయుడుకి పంపనున్నట్టు జిలాని భాష గారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటకలో ఉచిత బస్సు హామీ ఇచ్చి నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకే దక్కుతుందన్నారు. దేశ అభివృద్ధి రాష్ట్రాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిటీ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్ జిల్లా మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు ఎస్ ప్రమీల జిల్లా సేవాదళ్ మాజీ అధ్యక్షురాలు ఏ వెంకట సుజాత డిసిసి మాజీ సెక్రెటరీ అబ్దుల్ హై కాంగ్రెస్ నాయకులు సాయి కృష్ణ, ప్రతాపరెడ్డి, రమేష్, మధు ఐ ఎన్ టి యు సి నాయకులు ఎన్ సుంకన్న, గోవిందు, చక్రి మహిళా కాంగ్రెస్ కరుణమ్మ అయ్యమ్మ సావిత్రి రాములమ్మ మొదలగువారు పాల్గొన్నారు.