జిల్లా జైలులో గాంధీ జయంతి వేడుకలు
కర్నూలు, న్యూస్ వెలుగు; జైలులో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిన గాంధీ గారిని గుర్తు చేసుకుంటే బుధవారం గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల సంక్షేమ దినం గా యావత్ భారత దేశంలో ఉత్సవాలు జరుపుతారు..అందులో భాగంగా జిల్లా జడ్జి కపర్తి తో పాటు జిల్లా లీగల్ అడ్వైజర్ పోలీస్ కమాండెంట్ మహేష్ తో పాటు నేను కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాను..గాంధీ మనకు అహింస శాంతి సహనం సౌభ్రాతృత్వం అనేది మనకు నేర్పించారు.. కత్తులతో సాధించలేనిది అహింసతో సాధించవచ్చు మనం చేసే ప్రతి ప్రొటెస్ట్ అహింసాయుతంగా చేయాలి అని మానవాళికి నేర్పించి నందుకు 66 దేశాలలో ఆయన యొక్క విగ్రహాన్ని పూలమాలతో సత్కరిస్తున్నారు..ఖైదీలు క్షనికావేశంలో తప్పులు చేసి జైలుకు వెళ్లినా గాని ఇక్కడ జైలు అనేది ఒక దేవాలయం లాంటిది వారిలో సత్ప్రవర్తన తీసుకొచ్చి వారిని మరల జనజీవన స్రవంతిలోకి కలుపుతుంది.. వారు బయటకు వెళ్లిన తర్వాత సత్ప్రవర్తనతో మెలగాలని వాళ్లను సోదరులుగా స్వీకరించి వారి పట్ల గౌరవభావంతో ఉండాలనీ ప్రజలు కూడా గుర్తించాలి అని చెప్పడం జరిగింది..పేరుకే జైలు కానీ అక్కడ ఉన్న సౌకర్యాలు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది.. అక్కడ ఉన్న భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు, ఆర్వో వాటర్, మెడికల్ సదుపాయాలు అందించేకి ఓ ఆసుపత్రి, డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి, గుండె. ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు, సూపరింటెండెంట్,ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు ఇవన్నీ చూస్తే ఎంతో మంచి వాతావరణంలో ఉండడమే కాకుండా వారిలో మార్పు అనేది తప్పక జరుగుతుంది అని అనిపించింది.