న్యూఢిల్లీ: రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి అంకితం చేసిన ప్రత్యేక రైల్వే కోచ్‌ను కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మాగాంధీ జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఆయన అహింసా సూత్రం ఇప్పటికీ ఆచరణీయమని అన్నారు. రక్షణ, సాంకేతికత వంటి రంగాల్లో గాంధీజీ ఆత్మనిర్భర్ భారత్ విజన్‌ను ప్రభుత్వం అనుసరిస్తోందని షెకావత్ అన్నారు. ప్రకృతి దోపిడి కారణంగా వాతావరణ మార్పులు ఇటీవలి కాలంలో పెద్ద సమస్యగా మారాయని ఆయన అన్నారు. చెట్లను, గ్రహాన్ని కాపాడేందుకు మహాత్మాగాంధీ బోధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.
Thanks for your feedback!