పునః ప్రారంభమైన చెత్త నుండి సంపద తయారీ కేంద్రం
తుగ్గలి న్యూస్ వెలుగు: తుగ్గలి మండలం పరిధిలోని బొందిమడుగుల గ్రామంలో పత్తికొండ నియోజకవర్గ శాసనసభ్యులు కే.యి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు గ్రామంలోని గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ యండ చౌడప్ప, సర్పంచ్ సలహాదారులు ఎస్ ప్రతాప్ యాదవ్,గ్రామ సచివాలయం సిబ్బంది నేత్రుత్వంలో స్వచ్ఛ భారత్ షెడ్లను పూజా కార్యక్రమాలతో మళ్ళీ పునః ప్రారంభించడం జరిగింది.ఈ సందర్బంగా గ్రామ ప్రెసిడెంట్ సలహాదారులు ఎస్ ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ గత ఐదేళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో నిర్మించిన చెత్త సేకరణ షెడ్లను గత ప్రభుత్వం ఎటువంటి అవసరాలకు ఉపయోగించకుండా నిరూపయోగంగా ఉంచడంతో,అధికారంలోకి వచ్చిన ఎన్డిఏ కూటమి ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ఏర్పాటుచేసి గ్రామంలో ఉన్న ప్రజలు వ్యర్థమైన చెత్తను వర్మీ కంపోస్ట్ ఎరువులుగా ఉపయోగించి చెత్త సేకరణతో సంపద సృష్టించి నిర్వహించి మన వంట గ్యాస్ లకు అవసరమయ్యే బయోగ్యాస్ ను తయారు చేసి,వాన పాముల పెంపకాలను ద్వారా కూడా చెత్త వలన మనం ఏయే ఉపయోగాలు పొందవచ్చునో తెలియజేసేందుకు రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టి మళ్ళీ చెత్త సేకరణ కోసం స్వచ్ఛ భారత్ షెడ్లను పునః ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని ప్రతాప్ యాదవ్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రామాంజినేయులు,గ్రామ వార్డు మెంబర్ వీరేంద్ర,నాగప్ప,రమణయ్య,బుగ్గన రామాంజినేయులు,సచివాలయం సిబ్బంది శంకర్,నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.