నాటక కళాకారులకు జీవం పోయండి :కొత్తూరు సత్యం

నాటక కళాకారులకు జీవం పోయండి :కొత్తూరు సత్యం

న్యూస్ వెలుగు, కర్నూలు; నాటక రంగమే తమ జీవితాన్ని భావించే కళాకారులను ప్రజలు ఆదరించాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు . మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలను చైతన్యం కలిగించే విధానాల్లో ప్రభుత్వం లేకపోవడం, ప్రజల్లో కులమత విద్వేషాలు పెరిగి పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారుల ద్వారా ప్రభుత్వ పథకాలను అమలుపరిచే విధానాల్లో తోపాటు ప్రజలను చైతన్యం కలిగించే విధానాలు ఉంటాయన్నారు. కాలగర్భంలో కలిసిపోతున్న నాటక రంగాన్ని కార్పొరేట్ కళాశాలలు ముందుకు రావాలని ఆయన కోరారు. భవిష్యత్తులో నాటక రంగం అంటే ఏమిటి నాటక కళాకారులు మ్యూజియంలో చూడాల్సిన దుస్థితి రాకుండా ఉండాలన్నారు. వారంలో ఒకరోజు ప్రతి నియోజవర్గంలో మండల స్థాయిలో నాటకాలు ప్రదర్శనలు ఉండేలా స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు . గత చరిత్రను భవిష్యత్తును పెట్టుకొని నాటక కళాకారులు చెప్పే సందేశాలు రేపటి తరానికి ఉపయోగపడుతుందన్నారు. రాయలసీమ జిల్లాలో కళాకారులు ఉన్న వస్తులతో జీవించే దుస్థితి ఉందని, ఆకలి నేనా భరిస్తారు గాని నాటక రంగం లేకపోతే ప్రాణం ఉన్న ప్రాణం లేని జీవంలా బతికే దుస్థితి రాకూడదన్నారు .ఆనాడు రాజులు కళాకారులను, కవులను ప్రోత్సహించే వారని నేడు ప్రభుత్వాలు కళాకారులను కవులను విస్మరిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో స్థానిక కళాకారుల ద్వారా నాటకాలను ప్రదర్శించేందుకు జిల్లా యంత్రాంగం తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలని ఆయన కోరారు .ఎంతోమంది సినీ నటులు నాటక రంగం నుండి వచ్చిన వారేనని ,ఈ సందర్భంగా గుర్తు చేశారు . కళాకారులు, కవులు ప్రభుత్వం వద్ద చేతులు చాపకూడదని వారి కలను వారి సాహిత్యాన్ని గుర్తించి ప్రభుత్వం గుర్తించి వారిని గౌరవించాలన్నారు . కళా రంగంలో నాటక రంగంలో ఉన్నవారు సంతతికి ప్రభుత్వం చేయూత ఇవ్వాలన్నారు. ప్రతి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా నడక పోటీలను నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా ఆయన కోరారు. సినీ ప్రముఖులు కూడా వారి చిత్రాలలో నాటక ఒక వైభవాన్ని చూపించాలని ఆయన కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!