మా భూములకు పట్టాలు ఇవ్వండి : టిఎం రమేష్ మాదిగ

మా భూములకు పట్టాలు ఇవ్వండి : టిఎం రమేష్ మాదిగ

న్యూస్ వెలుగు దేవనకొండ : కర్నూలు జిల్లా దేవనకొండ మండలం జిలేడుబుడకల మజార గ్రామం మాదాపురం గ్రామం నందు నివాసం ఉంటున్న మాదిగ సురేష్ ,మాదిగ జయచంద్రుడు వీరు ఇద్దరు కలిసి దాదాపు 30 సంవత్సరాలుగా సర్వే నెంబర్ 427/2 విస్తీర్ణం 9 ఎకరముల 50 సెంట్లు భూమిని సాగు చేసుకుంటూ పంట పండించుకొని జీవనం పొందుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు వీరికి తెలియకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారికి రెవెన్యూ వెబ్ ల్యాండ్ నందు అక్రమంగా అడంగల్ వన్ బి ఎక్కించి సాగుదారులకు ఉద్దేశపూర్వకంగా మోసం చేసి నేరపూరితమైన కుట్రకు పాల్పడమైనది అక్రమంగా నమోదు చేసిన అడంగల్ వన్ బి ని రద్దుపరిచి సాగుచేసుకుంటున్న అనుభవ దారుల పేర్లు వెబ్ ల్యాండ్ నందు అడంగల్ వన్ బి నమోదు చేసి బాధితులకు రెవెన్యూ రికార్డుల నందు హక్కులు కల్పించాలని తహసిల్దార్ కి వినతి పత్రం అందించినట్లు టిఎం రమేష్ తెలిపారు .
స్పందించిన తహసిల్దార్  విచారణ జరిపించి సాగు చేసుకుంటున్నా వారికి చట్టపరంగా న్యాయం చేస్తాం అక్రమంగా వెబ్ ల్యాండ్ నందు నమోదు చేసిన అడంగల్ వన్ బి రద్దు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!