వైభవంగా శ్రీ మాళ మల్లేశ్వరుని రథోత్సవం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో సోమవారం దేవరగట్టు కొండ గుహలో 800 అడుగుల ఎత్తుల్లో స్వయంభువుగా వెలసిన శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఉదయం నుంచి స్వామివారి సన్నిధిలో జలాభిషేకం, రుద్రాభిషేకం,బండరార్చన,బిల్వార్చన, పంచామృతాభిషేకం,కుంకుమార్చన,ఆకుపూజ వంటి విశేష పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున పులమలలతో స్వామివారిని అలంకరించారు.అలాగే సాయంత్రం బిలెహల్ గ్రామం నుంచి మేటి కుంభాన్ని సకల వాయిద్యాల నడుమ ఊరేగింపుగా దేవరగట్టుకు చేరుకున్నారు.అనంతరం రథోత్సవానికి విశేష పూజలు అందించారు.అదేవిధంగా రథోత్సవం అశేష భక్తుల జయ జయ ధ్వనులు,గొరవయ్యల ఢమరుక నాదం,సకల వాయిద్యాల నడుమ స్వామి వారి రథోత్సవం రమణీయంగా ముందుకు సాగింది. రథోత్సవంల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలూరు సిఐ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో హోళగుంద ఎస్ఐ బాల నరసింహులు మరియు పోలీస్ సిబ్బందితో కలిసి గట్టి బందోబస్తు నిర్వహించారు.