
కుక్క కాటుకి గురైన వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి
డాక్టర్ ఇమ్రాన్ ఖాద్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రభుత్వ వైద్యశాల కర్నూలు
కర్నూలు, న్యూస్ వెలుగు; చిన్నపిల్లల కి పాఠశాలల అనేక సెలవుల సందర్భంగా ఎక్కువమంది పిల్లలు కుక్క కాటుకు గురవుతున్న విషయం సర్వ సాధారణంగా జరుగుతుంది. కుక్కకాటుకు గురైన వెంటనే మంచినీటితో గాయాన్ని శుభ్రం చేసుకుని అందుబాటులో ఉన్న యాంటీబయటిక్ లోషన్ రాసుకోవాలి. వెనువెంటనే దగ్గర్లో ఉన్న పీ.హెచ్.చి, సి.హెచ్.చి, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో డాక్టర్స్ నీ సంప్రదించాలి. కుక్క కాటు వల్ల పడిన గాయాన్ని బట్టి కోర్సు ప్రకారం వ్యాక్సిన్ అందిస్తారు. కాటు తీవ్రతను బట్టి వ్యాక్సినేషన్ ఉంటుంది. ఎలాంటి పత్యం ఉండాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరే కుక్కలు పెంచుకునే వారు ఉంటే ఆ కుక్కలకు ముందుగానే వ్యాక్సిన్ వేయించాలి. ఇంట్లో మనుషులు కూడా ప్రి వ్యాక్సినేషన్ చేయించుకుంటే రాబిస్ వ్యాధి రాకుండా అరికట్టుకోవచ్చు. అన్ని రకాల ప్రభుత్వ ఆస్పత్రులలో కుక్క కాటుకు సంబంధించిన వ్యాక్సిన్లు అన్ని వేళలలో అందుబాటులో ఉంటాయి అని తెలిపారు.