ఉల్లిపంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది : కలెక్టర్

ఉల్లిపంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది : కలెక్టర్

న్యూస్ వెలుగు కడప :   జిల్లాలో ఉల్లి పండించిన  రైతుల నుండి ప్రభుత్వం ఉల్లి ఒక క్వింటాల్ రూ.1200 /- ధర పై మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయు ప్రక్రియ సెప్టెంబర్ 4వ తేదీ నుండి జిల్లాలో ప్రారంభించడం జరిగిందని, ఈ కొనుగోలు ప్రక్రియ పకడ్భందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు డా. శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో జరుగుతున్న ఉల్లి కొనుగోలు ప్రక్రియ పై జిల్లా జాయింట్ కలెక్టరు అదితి సింగ్ , వ్యవసాయ, మార్క్ ఫెడ్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు  మాట్లాడుతూ, జిల్లాలో ఉల్లి పంట కొనుగోలు కొరకు 2 కొనుగోలు కేంద్రాలు వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసి) కమలాపురం, మైదుకూరు నందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు .  కేవలం e-Crop నందు నమోదు చేసుకున్న రైతులు మాత్రమే తమ పట్టాదారు పాసు పుస్తకం మరియు ఆధార్ కార్డుతో పాటు రైతు సేవా కేంద్ర సిబ్బంది ఇచ్చు ఉల్లిపంట నమోదు సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు మార్కెట్ యార్డుకు వచ్చు సమయంలో తప్పనిసరిగా తీసుకుని వచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ అవకాశమును జిల్లాలో ఉల్లిపంట పండించిన ప్రతి రైతు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఉల్లి రైతులకు సమాచారం నిమిత్తం కంట్రోల్ రూమ్ నెంబర్ 7095621491 మరియు ఎం. పరిమళ జ్యోతి, ఏపి మార్కెఫెడ్ జిల్లా అధికారిని సంప్రదించవచ్చునని తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!