ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఓపి బ్లాక్ క్యాజువాలిటీ తనిఖీ చేసిన అడిషనల్ డైరెక్టర్
న్యూస్ వెలుగు, కర్నూలు; ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఓపి బ్లాక్, క్యాజువాలిటీని తనిఖీ చేసిన అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే. చిట్టి నరసమ్మ . బుధవారం ప్రభుత్వ సర్వజన వైద్యశాల యందలి క్యాజువాలిటీ విభాగాన్ని ఓపి బ్లాక్ లని తనిఖీ చేయడం జరిగింది. క్యాజువాలిటీ యందు అత్యవసర రోగులకు అందుతున్న సేవలను నేరుగా పరిశీలించడం రోగులతో మాట్లాడి వివరాలు తెలుసు కోవడం జరిగింది. ఓపి బ్లాక్ యందలి అర్థో, జనరల్ మెడిసిన్, సర్జరీ విభాగాల ఒపీలను పరిశీలించి రోగుల ఒపీని, సిబ్బంది హాజరు పట్టీని తనిఖీ చేశారు. ఓ. పి ల యందు ప్రొఫెసర్లు,యూనిట్ ఇంచార్జీ లు హాజరు పూర్తిగా వుండటం తో సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా విభాగాల ఒ.పి ల యందు ప్రొఫెసర్లు, యూనిట్ ఇన్చార్జి విధిగా ఉండాలన్నారు. సాయంకాలం ఒపి క్రమం తప్పకుండా నడపాలని ఇన్వెస్టిగేషన్ రాసిన ప్రతి పేషంట్ ని చూసి వెంటనే చికిత్స అందేలా చూడాలని యూనిట్ ఇంచార్జీ లకు సూచన చేశారు. ప్రిన్సిపాల్ వెంట ఆసుపత్రి సి.యస్.ఆర్.యం.ఓ డా.వెంకటేశ్వరరావు, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ డా.నాగ శివబాలనాగాంజన్ హాజరు అయ్యారు.