గ్రూప్ 2 రోస్టర్ పాయింట్ పై ప్రభుత్వం వెంటనే స్పందించాలి -డివైఎఫ్ఐ

గ్రూప్ 2 రోస్టర్ పాయింట్ పై ప్రభుత్వం వెంటనే స్పందించాలి -డివైఎఫ్ఐ

కర్నూలు న్యూస్ వెలుగు; రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 2 అభ్యర్థులు తీవ్రమైన ఆందోళనలో ఉంటే ఏపీపీఎస్సీ మైన్స్ పరీక్షల తర్వాత పోస్టింగ్ సెలక్షన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని వెబ్ నాట్ రిలీజ్ చేయడం సరైంది కాదని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ ఒక ప్రకటనలో ఆరోపించారు. అభ్యర్థులందరూ పెద్ద ఎత్తున ఆందోళనలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కోర్టులో రోస్టర్ పాయింట్ లో తప్పులు ఉన్నట్లు ఒప్పుకున్నారు. వాటిని సరి చేయకుండా పరీక్షలు నిర్వహించకండి అని అభ్యర్థులందరూ ఆవేదన చెందుతుంటే ప్రభుత్వం మొండిగా అభ్యర్థుల వినతిని పట్టించుకోకుండా ఏకపక్ష మరో సమాధానం చెబుతూ ముందుకు వెళ్లడం అంటే అభ్యర్థుల యొక్క ఆవేదనను బాధలను పట్టించుకోకపోవడమే అని తెలిపారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆరిజంటల్ రిజర్వేషన్లను అమలు చేయాలని అభ్యర్థులు కోరుతున్నారని తెలిపారు. రోస్టర్ పాయింట్స్ సక్రమంగా లేకుండా పరీక్షలు నిర్వహిస్తే పరీక్ష రాసిన అభ్యర్థులు కూడా కోట్ల చుట్టు తిరుగుతూ ఉద్యోగాలు లేకుండా ఉండే ప్రమాదం ఉందని అభ్యర్థులందరూ తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం రోస్టర్ పాయింట్స్ సరిచేసిన తర్వాతనే పరీక్షలు పెట్టాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మొండిగా ముందుకెళ్తుందని ఇలాంటి వైఖరితో ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యార్థి యువజన సంఘాలు కూడా వారికి మద్దతు వెళ్ళవలసి వస్తుందని హెచ్చరించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!