
గ్రేడ్ 3 ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీస్ కు గ్రేడ్ 3 ప్రమోషన్లు వెంటనే చేపట్టాలని హెల్త్ సెక్రటరీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సంధ్యారాణి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి అంజిబాబు శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి నిర్మల సిఐటియు జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ డిమాండ్ చేశారు హెల్త్ సెక్రటరీస్ ప్రమోషన్ గురించి గత నెల రోజులుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న చేపట్టకపోవడంతో ఈరోజు డి ఎం హెచ్ ఓ ఆఫీస్ దగ్గర హెల్త్ సెక్రటరీస్ ఆందోళన నిర్వహించారు హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు మహేశ్వరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కడప జిల్లాలో ప్రమోషన్లు ఇచ్చినప్పటికీ మిగిలిన జిల్లాలో ఇవ్వకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు ప్రమోషన్ల ప్రక్రియ వెంటనే చేపట్టాలని వారు కోరారు ఆలస్యం అయ్యే కొద్ది అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా వెంటనే ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని కోరారు ధర్నా అనంతరం డిఎంహెచ్ఓ వినతి పత్రం అందజేశారు. డిఎంహెచ్ఓ గారు మాట్లాడుతూ తొందర్లోనే ప్రమోషన్ల ప్రక్రియ చేపడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జే నాగేశ్వరరావు అసోసియేషన్ నాయకురాలు వెంకటేశ్వరమ్మ గౌరీ తదితరులు పాల్గొన్నారు.