రెవిన్యూ సమస్యల పరిష్కారంకై గ్రామసభ
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు; రెవిన్యూ సమస్యల పరిష్కారం కై గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు బండి ఆత్మకూరు తాసిల్దార్ ధోని ఆల్ఫ్రెడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్ద దేవలాపురం గ్రామంలో భూ రీ-సర్వే రెవిన్యూ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భూ రీసర్వేలో చేసిన తప్పిదాలను సరిచేయడం కొరకు గ్రామాలలో గ్రామసభలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామసభల ద్వారా రైతులు తమ భూసమస్యలు పరిష్కారం చేసుకోవచ్చన్నారు. 104 అర్జీలు రైతుల నుంచి స్వీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నందిపాటి నరసింహారెడ్డి సర్పంచ్ పెద్దినేని పెద్దన్న నానుగొండ కృష్ణారెడ్డి డిష్ రామలింగం, శివ ప్రసాద్ రంగస్వామి పిచ్చల శివారెడ్డి ఆత్మకూరు డివిజన్ సర్వే ఇన్స్పెక్టర్ రవీంద్ర పాల్ మండల సర్వేయర్ పర్వీన్ విఆర్ఓ రామకృష్ణ గ్రామ సర్వేయర్ అక్రమ్ రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.