ఘనంగా టిడిపి ఇన్చార్జి భూపేస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
భూపేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా టిడిపి యువనాయకుల రక్తదాన కార్యక్రమం
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి చడిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు వేడుకలు జమ్మలమడుగులో అభిమానులు , కార్యకర్తలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. భూపేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా టిడిపి యువ నాయకుడు కొర్రపాటి పవన్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు . ఈ రక్తదాన కార్యక్రమంలో 54 మంది యువకులు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు బెడ్డు ,పండ్లు పంపిణీ చేశారు. భూపేష్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో సుఖంగా నిండు నూరేళ్లు ఉండాలని, రాజకీయంలో ఉన్నత స్థాయి పదవుల్లో ఉండాలని, భూపేష్ రెడ్డి గారిని దీవించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నాగ సుధీర్, దుద్యాల రమేష్, నాగచరణ్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!