ఘనంగా ఘంటసాల జయంతి వేడుకలు

ఘనంగా ఘంటసాల జయంతి వేడుకలు

న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు లో ఘంటసాల గాన కళా సమితి ఆధ్వర్యంలో ఘంటసాల 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని కిడ్స్ వరల్డ్ వద్దనున్న ఘంటసాల విగ్రహానికి ఆయన అభిమానులు, గాయకులు, ప్రముఖ వైద్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రోజులో ఒక్కసారి ఘంటసాల పాట వింటే ఆరోజంతా సంతోషంగా ఉంటుందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. ఆయన పాటలు వింటే శరీరం లోని అన్ని భాగాలు తెలియని అనుభూతి కలుగుతుందన్నారు. ఘంటసాలకు మరణం లేదని ఆయన పాట రూపంలో అందరి హృదయాల్లో జీవించే ఉన్నారని శంకర్ శర్మ కొనియాడారు. ఈకార్యక్రమంలో డాక్టర్. చంద్రశేఖర్, డాక్టర్.డబ్ల్యు. సీతారాం, చంద్రశేఖర్ కల్కూర, డిఎస్పీ. మహబూబ్ బాష, వాసు, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!