
ఘనంగా శవాసప్ప స్వామి ఉరుసు మహోత్సవ వేడుకలు
స్వామివారిని దర్శించుకుని మొక్కలను తీర్చుకున్న భక్తులు.
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని గల చెన్నంపల్లి గ్రామం నందు శవాసప్పా స్వామి ఉరుసును మహోత్సవ వేడుకలను నిర్వాహకులు,గ్రామ పెద్దలు,ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. శనివారం రోజున షంషేర్,ఆదివారం రోజున జియారత్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.శవాసప్ప స్వామి ఉరుసు మహోత్సవానికి విచ్చేయు భక్తుల కొరకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ రంగమ్మ,సర్పంచ్ గౌరవ సలహాదారుడు వెంకటపతి లు తెలియజేశారు.గ్రామ ప్రజలకు మరియు విచ్చేయు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. భక్తులు శవాసప్ప దర్గా నందు స్వామిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకుంటున్నారు.దర్గా వద్ద భక్తుల కొరకు పెద్ద ఎత్తున భోజన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు,గ్రామ పెద్దలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఉరుసు వేడుకలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జొన్నగిరి ఎస్సై జయశేఖర్ గౌడ్ తమ పోలీసులతో కలిసి ప్రతిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.


 Journalist Pinjari Imamulu
 Journalist Pinjari Imamulu