
రామలింగాయపల్లిలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు
తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా రంగురంగుల ముగ్గులు
విజేతలకు బహుమతులను అందజేసిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నబి రసూల్.
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. మూడు రోజులపాటు జరిగిన సంక్రాంతి పండుగ సంబరాలను చిన్న పెద్ద తేడా లేకుండా పండుగను బందుమిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు.ఇంటిముందు రకరకాల రంగుల ముగ్గులను వేస్తూ చిన్నారులు అలరించారు.మండల పరిధిలోని గల రామలింగాయపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామ మహిళల చేత సంక్రాంతి ముగ్గుల పోటీలను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నభి రసూల్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. గ్రామంలోని మహిళలందరూ ఆసక్తిగా తిలకించారు.ముగ్గులు పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా మిక్సీ ను దీప అనే మహిళకు,రెండవ బహుమతి ఇడ్లీ కుక్కర్ ను సుమిత్ర కు,మూడవ బహుమతిగా కూలింగ్ వాటర్ క్యాన్ రాజేశ్వరికు,నాలుగవ బహుమతిగా మహిమ కు,ఐదవ బహుమతిగా మహేశ్వరి కు గ్రామ ప్రజల సమక్షంలో ఆయన అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సాంప్రదాయాలను మరియు పద్ధతులను ప్రతి ఒక్కరు పాటించి గౌరవించాలని ఆయన తెలియజేశారు. ఈ సంక్రాంతి పండుగ రైతులకు పెద్ద పండుగని,ఈ పండుగను ప్రజలు కుటుంబ సభ్యులతో మరియు బంధుమిత్రులతో ఘనంగా సుఖసంతోషాలతో నిర్వహించుకున్నారని ఆయన తెలియజేశారు.ఈ రంగుల ముగ్గులు భారతీయ సంస్కృతికి ప్రతీక అని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏ సూర్య నారాయణ,నబి సాహెబ్,ఎద్దులపల్లి పులికొండ,గ్రామ ప్రజలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.