
ఘనంగా మెలమరి సాయిబన్న తాత ఉరుసు
హొళగుంద న్యూస్ వెలుగు : మండల కేంద్రంలో వెలసిన శ్రీ అవరూడ శ్రీ సిద్ధలింగప్ప తాత ప్రియ శిష్యులు శ్రీ సద్గురు మెలమరి సాయిబన్న తాత ఉరుసు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఇందులో భాగంగా సోమవారం అర్ధరాత్రి సాయిబన్న తాత వంశస్థులు గంధాని తలపై మోసుకొని మేళ తాళాలు డప్పు వాయిద్యాల నడుమ దాదా వారి గంధాన్ని పురవీధుల గుండా ఊరేగింపుగా బయలుదేరారు.తెల్లవారుజామున 4 గంటలకు బస్టాండ్ వద్ద చేరుకుని భక్తులు కర్ర సాము ప్రదర్శించారు.ఉదయం 6:30నిమిషాలకు గంధంతో దర్గాకు చేరుకుంటారు.తదనంతరం దర్గాలో దాదా వారికి ప్రత్యేక ఫాతేహాల్ నిర్వహించారు.
అలాగే ఉరుసు ఉత్సవాల్లో ఆంధ్ర,కర్ణాటక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దాదా వారికి నైవేద్యం సమర్పించి,మొక్కుబడులు తీర్చుకున్నారు.దింతో దర్గా భక్తులతో కిటకిటలాడింది.ఈ సందర్భంగా దర్గా పూజారులు మాట్లాడుతూ తాత కోరిన కోర్కెలు తీర్చే మహిమ గల స్వామి అన్ని చెప్పారు.ఈ ఉరుసు ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ దిలీప్ కుమార్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.