
కనకదాసు భవనం కొరకు పట్టా మంజూరు చేయండి
హొళగుంద, న్యూస్ వెలుగు: మండలంలో కనకదాసు భవనం కొరకు మదాసి మదారి కురువ సంఘం మండల గౌరవ అధ్యక్షుడు కాలిక ప్రసాద్ ఆదివారం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామ శివారులోని కడ్లేమాగి రస్తాకు వెళ్లు రహదారిలోని సర్వే నెంబర్ 373 లో 0.30 సెంట్లలో గత 7 సంవత్సరాలుగా అనుభవంలో ఉంటున్నాము,మా సంఘానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఈ స్థలములోనే చేసుకుంటామని ఈ భూమిని మదాసి కురువ సంఘం సభ్యులు తరపున కనకదాసు ఆశ్రమము,కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి ఈ భూమిపై సర్వహక్కులు మదాసి మదారి కురువ సంఘానికి వర్తించే విధంగా పట్టా మంజూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎండిహళ్లి సర్పంచ్ సుధాకర్,గిరి,మదాసి మదారి కురువ సంఘం తాలూకా ప్రధాన కార్యదర్శి పెద్దహ్యాట మల్లయ్య,మదాసి కురువ సంఘం మండల కన్వీనర్ కురవ పంపావతి,సంఘం సలహాదారుడు కొగిలాతోట శేషప్ప,బొజ్జన్న,డాక్టర్ రామాంజిని,ఎలార్తి సర్ధార్, గజ్జళ్లి పూజారి రామలింగ,సంఘం ఉపాధ్యక్షులు బసవరాజు,రాయన్న సంగం ఆలూరు తాలూకా ప్రధాన కార్యదర్శి,మంజు,మల్లికార్జున,వార్డు మెంబర్ చిన్నహ్యట మంజు,పాపయ్య తాత,తదితరులు పాల్గొన్నారు.