డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కి ఘనంగా సన్మానం

డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కి ఘనంగా సన్మానం

కర్నూలు న్యూస్ వెలుగు; ప్రాణాపాయ స్థితిలో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని కార్డియోధోరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి క్లిష్టమైన గుండె ఆపరేషన్ చేయడం వలన సంతోషంగా జీవిస్తున్నామని అందువల్లే వారిని ఘనంగా సన్మానించుకుంటున్నామని పలువురు సర్జరీ చేయించుకున్న రోగులు గురువారం కర్నూలు నగరం లోని బిర్లా కాంపౌండ్ యందలి కృష్ణకాంత్ ప్లాజాలోని డా. బ్రహ్మారెడ్డి సమావేశం మందిరం యందు కార్డియోధోరాసిక్ సర్జన్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఒంటరిగా వచ్చాం ఒంటరిగానే పోతామని వెంట తీసుకుపోయేదేమీ లేదని ప్రతి మనిషికి జీవించే హక్కు ఉందని క్లిష్టమైన గుండె సమస్యలతో మరణం సంభవించే పరిస్థితులు ఏర్పడినప్పుడు జీవన హక్కును కాపాడే బాధ్యత తీసుకుని ఒక ప్రభుత్వ డాక్టర్ దాదాపు వెయ్యి కి పైగా గుండె ఆపరేషన్ లు చేశానని ఎంతో తృప్తి గా ఉందని నేడు ఆ సేవల వల్ల సంతోషంగా జీవనం సాగిస్తున్న తనకు సన్మానం చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని తెలిపారు. ఇష్టమైన ఆపరేషన్లు విజయ వంతంగా నిర్వహించడం అనే కిక్కు వేరే వుంటుంది . డాక్టర్ తెలుస్తుందని అన్నారు. కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో కార్పొరేట్ హాస్పిటల్ కు దీటుగా కార్డియోధోరాసిక్ విభాగాన్ని తీర్చిదిద్దామని అది నేడు వందల మందికి ప్రాణదానం చేస్తుందని తెలిపారు. తాను నిర్వహించిన క్లిష్టమైన సర్జరీల్లో తనకు ఎంతో సపోర్టుగా నిలిచిన అసిస్టెంట్లను నర్సింగ్ సిబ్బందిని వారి సేవలు ఎంతో గొప్పవని ఎంతో గొప్పగా సేవలు అందిస్తున్నారు అని కొనియాడారు. డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్లు చేయడం ఒక కళయని అందులో స్వతహాగా ఆసక్తి ఉన్నవారే క్లిష్టమైన ఆపరేషన్లను చాలెంజ్ గా తీసుకుంటారని అందులో డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి ప్రముఖులని వారి ద్వారా కొన్ని వేల గుండె ఆపరేషన్లు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందడం అన్నది ఎంతో హర్షించదగ్గ విషయం అన్నారు. నరసరావుపేట కు చెందిన నరసింహా రెడ్డి,కర్నూలు కు చెందిన విశ్వేశ్వరయ్య, శంకర్రావు కుటుంబ సభ్యులు బ్రేక్ ఇన్స్పెక్టర్ క్రాంతి తదితరులు మాట్లాడుతూ గుండె జబ్బులతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న మాకు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి సర్జరీ వల్ల పునర్జన్మ లభించినట్లు అయిందని నేడు సంతోషంగా జీవిస్తున్నామని ప్రభుత్వాసుపత్రిలో కూడా ఇలాంటి సేవలు దొరకడం అన్నది నిజంగా సంతోషంగా ఉందని అందుకే వారిని ఘనంగా సన్మానించుకుంటున్నామని వారు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేట్ విత్ గ్రీన్ సొసైటీ అధ్యక్షులు అడ్వకేట్ శ్రీరాములు, హంద్రీ పరిరక్షణ సమితి నాయకులు రామకృష్ణారెడ్డి, డాక్టర్ ఇస్మాయిల్, ప్రతాప్ రెడ్డి, కవి ఎలమర్తి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!