పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే 

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే 

  ఎస్పీ విక్రాంత్ పాటిల్ 

కర్నూలు న్యూస్ వెలుగు; పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి యొక్క సమస్యల పరిష్కారం కొరకు శుక్రవారం  కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో “పోలీస్ వెల్ఫేర్ డే” (గ్రీవియన్స్ డే) ను నిర్వహించారు.
జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు మరియు ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు వారి యొక్క సమస్యల గురించి ( ట్రాన్స్ఫర్స్, రిక్వెస్ట్లు, మెడికల్ సమస్యలు) జిల్లా ఎస్పీ గారికి విన్నవించుకున్నారు.
జిల్లా ఎస్పీ సమస్యలను విని, వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపుతానని సిబ్బందికి భరోసా కల్పించారు.
సిబ్బంది వారి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రీవియన్స్ డే ను ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.జిల్లా పోలీస్ కార్యాలయం – కర్నూల్

Author

Was this helpful?

Thanks for your feedback!