గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను రెండు నెలల పాటు వాయిదా వేయాలి

గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను రెండు నెలల పాటు వాయిదా వేయాలి

జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; నిరుద్యోగులు చాలా కాలం నుంచి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఏపీపీఎస్సీ ప్రకటించింది జనవరి 5 నుండి మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది పరీక్షలు షెడ్యూల్ ను మరో రెండు నెలల పాటు వాయిదా వేసి ఎలాంటి వివాదాలు లేకుండా ఫిబ్రవరిలో నిర్వహించేలా చూడాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కె.ప్రసాద్ తెలిపారు. గురువారం నాడు జమ్మలమడుగు లో స్థానిక ఎన్జీవో కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ అనేక పోరాటాల తర్వాత గ్రూపులకు సంబంధించి గత సంవత్సరం చివర్లో 899 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందని 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు దాదాపు నాలుగు లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు పరీక్ష రాశారని గుర్తు చేశారు ఏప్రిల్ 10న ఫలితాలు ప్రకటించారు. మెయిన్స్ కు 1:100 ప్రకారం తీసుకొని జూలై 28 పరీక్షలు నిర్వహించాల్సిన పరీక్షను ఏపీపీఎస్సీ చైర్మన్ లేకపోవడంతో వాయిదా వేస్తూ వచ్చారని తెలిపారు.ఇప్పుడు ఉన్నఫలంగా జనవరి ఐదు నుండి మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించడం వల్ల గ్రామీణ ప్రాంత పేద అభ్యర్థులు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు.సిలబస్ దృష్టిలో ఉంచుకొని కనీసం 90 నుంచి 120 రోజులు గడువు ఇవ్వాలని కోరారు.ఇప్పటికే డిసెంబర్ చివరి వారంలో పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ రైల్వే పరీక్షలు వంటివి ఉండటం వల్ల సమయం సరిపోదు అన్నారు. ఏపీపీఎస్సీ ప్రకటించిన పరీక్షల గడువును రీ షెడ్యూల్ చేయాలని కోరుతున్నామన్నారు. ఎటువంటి వివాదాలు లేకుండా ప్రతిసారిలాగా కోర్టుమెట్లు ఎక్కకుండా చూడాలని పరీక్ష నిర్వహణ దగ్గర నుంచి మూల్యాంకనం వరకు చిత్తశుద్ధితో నిజాయితీతో నిర్వహించాలని కోరుతున్నామన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ చైర్మన్ పునరాలోచించి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు రెండు నెలల సమయం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో అంజి,నవీన్,నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!