హజ్ యాత్రకులకు శిక్షణ తరగతులు…!

హజ్ యాత్రకులకు శిక్షణ తరగతులు…!

నంద్యాల, న్యూస్ వెలుగు;  2025 సంవత్సరానికి హజ్ కమిటీ అఫ్ ఇండియా ద్వారా హజ్ యాత్రకు ఎంపికైన ముస్లిం సోదరులు ఎటువంటి ఆటంకాలు లేకుండా హజ్ యాత్ర పూర్తి చేసి అల్లా కృపకు పాత్రులు కావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు శ్రీ ఎన్. యమ్. డి. ఫయాజ్ అన్నారు. నంద్యాల నేషనల్ పి. జి. కళాశాల యందు ఆదివారం నిర్వహించిన ఉమ్మడి కర్నూల్ జిల్లా హజ్ యాత్రికుల ఒకరోజు శిక్షణాకార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధి గా టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ హాజరు అయ్యారు.. నేషనల్ విద్యాసంస్థల అధినేత మరియు నంద్యాల జిల్లా హజ్ సేవా సమితి అధ్యక్షులు డా. యస్. ఇంతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరు ఐనా వారి నుద్దేశించి ఆయన మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు శ్రీ ఎన్. ఎమ్. డి. ఫరూక్ గారి ఆదేశాల మేరకు ఈ పవిత్ర కార్యక్రమానికి హాజరు కావడం తనకు ఆ భగవంతుడు కల్పించిన అవకాశామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హజ్ యాత్ర కు వెళ్ళాలి అనుకునే ముస్లిం సోదరులకు అనేక సౌకర్యాలు, రాయితీలు కల్పించినట్లు చెప్పారు.. ఈ కార్యక్రమానికి నంద్యాల మరియు కర్నూలు జిల్లాలో వివిధ ప్రాంతాలనుండి విచ్చేసిన 250 మంది హజ్ యాత్రకు ప్రభుత్వం ద్వారా ఎంపికైన వారు హాజరు కావడం జరిగింది.. రాష్ట్ర హజ్ కమిటీ, విజయవాడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ. గౌస్ పీర్ గారు మాట్లాడుతూ, మన రాష్ట్రము నుండి హజ్ యాత్రకు ఎంపికైన వారు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యలను వినియోగించు కుని హజ్ యాత్ర ను పూర్తి చేసుకోవాలని అన్నారు.. మౌలానా అబ్దుల్ మజీద్ గారు హజ్ యాత్రకు వెళ్లే వారు యాత్ర ప్రారంభం నుండి, పూర్తి అయ్యేవరకు పాటించావాల్సిన నియమ నిభందనలు, చేయవలిసిన వివిధ రకాల ప్రార్థన ల గురుంచి సమూలం గా వివరించారు.. గత 20 సంవత్సరాలనుండి నంద్యాల మరియు కర్నూలు జిల్లా నుండి హజ్ యాత్రకు వెళ్తున్న వారికి జిల్లా హజ్ సేవ సేవ సమితి ద్వారా సేవ చేసే అవకాశామ్ భగవంతుడు అల్లా తనకు కల్పించడం తన పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నట్లు డా. ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు..ఈ కార్యక్రమం లో నేషనల్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ రఫీక్ అహ్మద్, తెలుగు దేశం పార్టీ నంద్యాల పట్టణ అధ్యక్షులు మనియార్ ఖలీల్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ అఫ్ స్కూల్స్ హసముద్దీన్, అబ్దుల్ హాదీ, మహబూబ్ బాషా, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!