ఘనంగా ఎన్ టి రామారావు వర్ధంతి

ఘనంగా ఎన్ టి రామారావు వర్ధంతి

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ నందు శనివారం టీడీపీ మండల సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు వెండితెర దేవుడిగా వెలుగుంది,పేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకున్న,నట విఖ్యాత సార్వభౌముడు,బడుగు బలహీన వర్గాల ప్రజలకు వరి అన్నం తినే మహా దవకాశం కల్పించిన అన్న,ఎన్టీఆర్ పలు సంక్షేమ పథకాలతో పాటు పాలన సంస్కరణలో కొత్త శకానికి కూడా ఆధ్యుడు.బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం,తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలోనే అధికారానికి తీసుకువచ్చిన ఆయన,1983 జనవరి 9న తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.అలాగే రాష్ట్రానికి అందించిన సేవలను కొనియాడారు.ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఎంతో మెరుగైన సేవలు చేశారన్నారు.మరియు ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు ఎర్రి స్వామి,పంపాపతి,బసవరాజ్,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్య కమిటీ చైర్మన్ ద్వారక నాథ్,జాకీర్,తిక్క స్వామి,తిప్పన్న,పవన్,అంజి, వెంకటేష్,సూరన్న,బుదేప్ప, మోహిన్,హుసేన్ పిరా,అయ్యప్ప రెడ్డి,మంజు నాథ,వలి,బాలయ్య అభిమానులు,జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS