ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం

ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం

బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు; పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని సోమవారం బండి ఆత్మకూరు పోలీసు స్టేషన్లో అమరవీరుల ఘనంగా జరుపుకున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ జగన్మోహన్ మాట్లాడుతూ… పోలీసులు ప్రజా రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయరన్నారు. అమరులైన పోలీసుల ఆశయ సాధన కోసం కృషిచేద్దామన్నారు. ప్రజా స్వామ్యవ్యవస్థలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసులు తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారన్నారు. ప్రతి పోలీసు దేశానికి వెన్నెముకలాంటి వాడన్నారు. అమరవీరుల స్తూపం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ అక్బర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!