బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోండి

బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోండి

బన్నీ ఉత్సవాల్లో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలి
ఉత్సవాలు 100 సిసి కెమెరాలు,5 డ్రోన్ కెమెరాలు,భారీ లైటింగ్ తో గట్టి నిఘా
ఉత్సవాలకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు
జిల్లా ఎస్పీ బిందుమాధవ్,జాయింట్ కలెక్టర్ డా.బీ.నవ్య
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో దేవరగట్టు కొండల్లో వెలసిన శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాల ఏర్పాట్ల పై శనివారం జిల్లా ఎస్పీ బిందుమాధవ్,జయింట్ కలెక్టర్ డా.బీ.నవ్య దేవరగట్టు శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులతో  మూడు గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించారు.ముందుగా జిల్లా ఎస్పీ బిందుమాధ,జాయింట్ కలెక్టర్,ఆదోని సబ్ కలెక్టర్ ను ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.అనంతరం గిరి పై ఉన్న శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బీ.నవ్య మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన స్వామివారి ఉత్సవాన్ని భక్తులు శాంతి యుతమైన వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.మరియు ఆచారాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు.అంతేకాకుండా ఆచారం పేరుతో ఉత్సవాలకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా,హింసకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలను దిగ్విజయం చేయాలని కోరారు.అలాగే ఉత్సవాలతో పాటు చట్టాలను కూడా గౌరవించాలని పిలుపునిచ్చారు.ఆయా శాఖల అధికారులు తమకు అందించిన విధులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.అనంతరం జిల్లా ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ ఉత్సవాలు సంప్రదాయ బద్దంగా,శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు.మరియు ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకునేలా ఇప్పటికే ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా అన్ని శాఖల అధికారులు తమ తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని,ఇందుకు పోలీస్ శాఖ తరుపు ఏ సహకారం కావాలన్న ముందు ఉంటామన్నారు.ఇందులో భాగంగా భక్తులు కూడా ఉత్సవాన్ని భక్తీ భావంతో,ఉల్లాసంగా….ఉత్సహంగా జరుపుకోవాలని చెప్పారు.ఉత్సవాల్లో మద్యం సేవించి వచ్చే వారిని దూరంగా ఉంచాలని సూచించారు. పవిత్రమైన ఉత్సవాల్లో మద్యం సేవించి పాల్గొనడం వల్ల రక్త గాయాలు అవుతున్నాయన్నారు.ఎవరూ కూడా ఉత్సవాలకు కర్రలు తీసుకురాకూడదని చెప్పారు.మద్యం అరికట్టేందుకు చెక్ పోస్టులు,భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అలూరు తాలూక టీడీపి ఇంచార్జీ వీరభద్ర గౌడ మాట్లాడుతూ ఉత్సవాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండాలంటే మధ్యంను అరికట్టాలని తెలియజేశారు.అలాగే మైన్ రోడ్డు నుంచి దేవరగట్టు వరకు గ్రావెల్ వేయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అర్చకులు గిరి స్వామి,ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్,డీఎస్పీ వెంకటరామయ్య,ఆలూరు సిఐ శ్రీనివాస్ నాయక్,హోళగుంద ఎస్ఐ బాల నరసింహులు,తహసీల్దార్ ప్రసాద్ రాజ్,విద్యుత్ ఏఈ ఓబులమ్మ,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామ్ లీలా,అన్ని శాఖల అధికారులు,ఆలయ కమిటీ సభ్యులు,సర్పంచ్ తనయుడు సోమప్ప,రామ్ నాయక్,మూడు గ్రామాల ప్రజలు తిమ్మయ్య,మల్లి గౌడ,తిమ్మప్ప, మల్లి,గాది గౌడ్,సోమశేఖర్ గౌడ,రవి,వీరేష్,అడ్వకేట్ మల్లికార్జున గౌడ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!