
నిరంతరం ప్రజలకోసం పనిచేసిన నేత ఆయన
తుగ్గలి (న్యూస్ వెలుగు ): కర్నూలు జిల్లా తుగ్గలి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ జాతీయ మాజీ కార్యదర్శి సీతారం ఏచూరి వర్దంతిని శుక్రవారం నిర్వహించినట్లు తుగ్గలి మండల కార్యదర్శి శ్రీరాములు తెలిపారు. ఏచూరి విద్యార్ది దశనుంచే అభ్యుదయ భావాలతో పనిచేసినట్లు ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను పరిస్కరించం కోసం నిరంతరం పనిచేసిన నేత ఆయన అని , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన వ్యక్తి ఆయన అలాంటి గొప్ప నేత యొక్క ఆశయ సాదన దిశగా యువత నడవాలని యువతకు పిలునిచ్చారు. కేంద్రంలో ప్రతిపక్షాలను ఏకం చేయడంలోనూ, కార్పోరేట్ రాజకీయాలకు వ్యతిరేకంగా నికచ్చైయిన రాజకీయాలు చేసిన వ్యక్తి,పార్లమెంట్ లో ప్రజల పక్షాన నిలబడి నిజాయితిగా పనిచేస్తూ దెస రాజకీయ మేధావులకు ఆయన ఒక దిక్సూచి ,ఒక మార్గదర్శి అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు రంగస్వామి , రాజు , ఈశ్వరప్ప ,స్వామి తదితరులు పాల్గొన్నారు.


 Journalist Pinjari Imamulu
 Journalist Pinjari Imamulu