
దౌర్జన్యంగా మున్సిపల్ చైర్మన్ పదవి..!
ఎన్టీఆర్ జిల్లా న్యూస్ వెలుగు : విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో కమిషనర్ నీలం సాహ్నీ ని కలిసిన వారు తెలిపారు. తిరువురులో టీడీపీ కూటమి దౌర్జన్యంగా మున్సిపల్ చైర్మన్ పదవిని పొందినట్లు ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటిస్తే..పోలీసులతో ప్రజలను అడ్డుకోవాలని ప్రయత్నం చేశారని ఆయన కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసారు. అయినా ప్రజలు వేలాదిగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఆయన అన్నారు. రేపు జరిగే ఎన్నికలు సవ్యంగా జరగాలని ఈసీని కోరినట్లు ఆయన మీడియాకు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!