
ఓరియంటల్ హైస్కూల్ హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేయాలి
డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం డేవిడ్ రాజ్
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్ వెలుగు; పొద్దుటూరు పట్టణంలోని గీత ఆశ్రమంలోని ఓరియంటల్ హై స్కూల్ హెడ్మాస్టర్ సుధీర్ కుమార్ ను తొలగించాలని డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు డిమాండ్ చేశారు. అనంతరం పత్రిక విలేకరులతో మాట్లాడుతూ పొద్దుటూరు పట్టణంలోని గీత ఆశ్రమం లో ఓరియంటల్ హై స్కూల్ హెడ్మాస్టర్ సుధీర్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాము ఎందుకనగా విద్యార్థుల తల్లిదండ్రులు చదువు కోసం విద్యార్థులను స్కూలుకు పంపిస్తే ప్రధానోపాధ్యాయులు సుధీర్ కుమార్ విద్యార్థులతో తమ సొంత పనులు, బయటి పనులు చేపించుకుంటున్నారు. కాబట్టి వెంటనే సుధీర్ కుమార్ పై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. లేనిపక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.
Was this helpful?
Thanks for your feedback!