హెడ్మాస్టర్ ను విధుల నుండి తొలగించాలి

హెడ్మాస్టర్ ను విధుల నుండి తొలగించాలి

ప్రతి ఉపాధ్యాయుడు మండల హెడ్ క్వార్టర్లో నివసించాలి

రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ డిమాండ్

ముద్దనూరు, న్యూస్ వెలుగు; స్థానిక ముద్దనూరు పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హై స్కూల్ నందు నిరసన తెలియజేశారు,
సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు జగన్, లింగమయ్య,మాట్లాడుతూ ముద్దనూరు పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ను విజిట్ చేయడం జరిగింది, అయితే అక్కడి విద్యార్థులు భోజనం టైం లో ఎక్కడపడితే అక్కడ కూర్చొని భోజనం చేస్తున్నారు అక్కడ హెడ్మాస్టర్ గాని టీచర్స్ గాని చెప్పేటోళ్లు లేక వాళ్ళ ఇష్టానుసారం ప్రకారం గోడలపైన కాంపౌండ్ పైన ఇసుకలో కూర్చొని రకరకాలుగా భోజనం చేస్తుంటే అక్కడి హెడ్మాస్టర్ గారి క్రమశిక్షణ ఎంతవరకు అనేది అక్కడ అర్థమవుతున్నా విషయం ఆ విషయం పైన మేము అక్కడి టీచర్స్ ను అడుగుతే ఎంతమందినీ మేము కంట్రోల్ చేయాలి అనడం బాధాకరమైన విషయం ఎందుకంటే లక్షలు జీతాలు తీసుకుంటున్నారు విద్యార్థులు ఎట్ల పోయిన మాకు సంబంధం లేదు వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఇవన్ని వినకపోయినా మేం చేసే పని చేస్తాం అనే విధంగా వ్యవహరించడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఒక క్రమశిక్షణ పద్ధతిలో విద్యార్థులకు భోజనం పెట్టించడం లేదు అదేవిధంగా విద్యార్థులకు ఈరోజు మెనూ ప్రకారం కూరగాయల పలావు గుడ్డు, ఉర్లగడ్డ కుర్మా ఉన్నప్పటికీ అక్కడి వంటవాళ్ళు పులిహోర చట్నీ పెట్టడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అక్కడి హెడ్మాస్టర్ భోజనం పరిశీలించకుండా అక్కడ మెనూ కూడా హెడ్మాస్టర్ పరిశీలించకుండా అక్కడ టీచర్స్ గాని పరిశీలించకుండా విద్యార్థుల కంటే ముందే హెడ్మాస్టరు రాజా బాబు ఆయన సొంత గృహానికి భోజనానికి వెళ్లడం చాలా దుర్మార్గమైన విషయం ఫస్ట్ విద్యార్థుల సౌకర్యం చూసుకోవాలి అట్లా కాకుండా వాళ్ల సౌకర్యాలు చూసుకుంటున్నారు తప్పా విద్యార్థుల సౌకర్యాలు చూసుకోవడంలో విఫలమయ్యారని తక్షణమే హెడ్మాస్టర్ డ్యూటీ కి గైర్హాజరు అవుతున్న ఈయనను విధుల నుండి తొలగించాలని వారు విమర్శించారు. అనేది పక్కన పెట్టి విద్యార్థులను పట్టించుకోవడంలో విఫలమయ్యారని వారు విమర్శించారు అదేవిధంగా ప్రభుత్వ ప్రతి టీచర్ ఉద్యోగి మండల హెడ్ క్వార్టర్ లో ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ ఏ ఒక్క టీచర్ గాని ఇక్కడి హెడ్మాస్టర్ రాజబాబు గారు గాని మండల హెడ్ క్వార్టర్ లో నివసించకపోవడం సమయపాలన పాటించకపోవడం అనేది విద్యార్థులను మోసం చేసినట్టే అని వారు విమర్శించారు, తక్షణమే జిల్లా కలెక్టర్ గారు జిల్లా విద్యాశాఖ అధికారులు ఈయనపై చర్యలు తీసుకొని విధుల నుంచి తొలగించాలని ప్రతి ప్రభుత్వ టీచర్ ఉద్యోగి మండల హెడ్ క్వార్టర్ లో నివసించే విధంగా చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఉద్యమాలను చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు డివిజన్ అధ్యక్షులు నాయక్ తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!