
నాలుగు రోజులు భారీ వర్షాలు
న్యూస్ వెలుగు అమరావతి :
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖా సూచించింది. శుక్రవారం (13-06-25) మన్యం, అల్లూరి,కాకినాడ,ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, పల్నాడు,ప్రకాశం,నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Was this helpful?
Thanks for your feedback!