ప్రతి జిల్లా కేంద్రంలో హెల్మెట్ల దుకాణాలు ఏర్పాటు చేయాలి
న్యూస్ వెలుగు, కర్నూలు; ద్విచక్రం వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించడం మంచిది కానీ నాణ్యమైన హెల్మెట్లు ఎక్కడ ఉన్నాయని కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధా న కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా ప్రశ్నించారు. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ వాహన చట్టం ప్రకారం హెల్మెట్ ధరించాల్సిందే కానీ ఐ ఎస్ ఐ ఐ మార్క్ కలిగిన హెల్మెట్లు ఎక్కడ లభిస్తున్నాయో ప్రభుత్వం చెప్పాలని ఆయన కోరారు. చాలామంది రోడ్ల పక్కన హెల్మెట్ బాక్సులు కనిపిస్తున్నాయని, కొన్నిటికి ఐఎస్ఐ మార్కు ఉన్నాయని అవి ఎంతవరకు నిజమని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ వచ్చిందంటే హెల్మెట్ల ప్రస్తావన వస్తుందని ఆ తర్వాత షరా మామూలే అవుతుందన్నారు. హెల్మెట్ ధరించని వారిపై జరిమానా విధించడం జరుగుతుందని అయితే నాణ్యమైన ఐ ఎస్ ఐ మార్కు హెల్మెట్లు ప్రభుత్వం సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు .సెల్ ఫోన్ల అమ్మకాల కోసం ప్రత్యేకంగా ఆయా కంపెనీలు దుకాణాలు ఏర్పాటు చేస్తాయని ,అదేవిధంగా హెల్మెట్ల కోసం ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లా కేంద్రంలో హెల్మెట్ల దుకాణాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. చాలామంది వినియోగదారులు నాణ్యమైన హెల్మెట్లు వాడకపోవడం వల్ల ప్రమాదాల సమయంలో కూడా అవి పని చేయడం లేదని పలువురు వాపోతున్నారని అని తెలిపారు. హెల్మెట్లు ఉన్నా కూడా తల పగిలిందన్న విమర్శలు కూడా ఉన్నాయన్నారు. ఎన్ని వాహనాలు ఉన్నాయి ..ఎన్ని హెల్మెట్లు అందుబాటులో ఉన్నాయి అన్న విషయాన్ని కూడా ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. నేషనల్ హైవే లో వెళ్లే ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని తెలిపారు . చాలా ప్రమాదాలు వేగంగా వాహనాల నడపడం వల్లే జరుగుతాయని, అక్కడక్కడ రోడ్లలో గుంతలు సరైన సిగ్నల్స్ లేకపోవడం కూడా మరో కారణమన్నారు. వినియోగదారులను చైతన్యం కలిగించే వినియోగదారుల సంఘాలు నిద్రావస్థలో ఉన్నాయని , అలంకారప్రాయంగా వినియోగదారుల సంఘాలు ఉన్నాయని ఆయన విమర్శించారు.