
పరిశుభ్ర గ్రామ నిర్మాణానికి సహకరించాలి
హోళగుంద, న్యూస్ వెలుగు: పరిశుభ్ర గ్రామ పంచాయతీ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తహసీల్దార్ సతీష్,
స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా సామూహిక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.మరియు ప్రతి పౌరుడు తమ చుట్టూ పక్కల ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.అనంతరం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ పై ప్రతిజ్ఞ చేపట్టారు.ఈ కార్యక్రమంలో రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ ముంకుద రావు,పీఆర్ఏఈ యమునప్ప,విఆర్ఓలు నాగరాజా,దామోదర,మల్లేష్,సూరాంజనేయులు,ప్రహ్లాద, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీ,పంచాయతీ సెక్రెటరీలు నాగరాజా,రాజ్ కుమార్,అంగన్వాడి కార్యకర్తలు,ఆశా వర్కర్లు,గ్రామ సేవకులు,సచివాలయం సిబ్బంది,గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.