
ఆమె మరణం పార్టీకి తీరని లోటు: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు
కర్నూలు : సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు వెంకటలక్ష్మి మంగళవారం తెల్లవారుజామున మరణించడంతో విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీకృష్ణ జిల్లా కేంద్రంలోని ఆమె ఇంటికి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మురళీకృష్ణ మాట్లాడుతూ కర్నూల్ నగరం చిదంబర వీధికి చెందిన వెంకటలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో 1990 సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తూ ఏ ఇతర పార్టీల వైపు చూడకుండగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఆమె జీవిత యాత్ర కొనసాగించిందనీ పార్టీ కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేదని చివరికి కాంగ్రెస్ పార్టీలో ఉండి మరణించడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా మిగిలి పోయిందనీ కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ కార్యకర్తని పోగొట్టుకోవడం చాలా బాధాకరమన్నారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నామని మురళీకృష్ణ తెలిపారు.
భౌతికకాయాన్ని నాగ శేషులు, లాజరస్ ఐఎన్ టియుసి ఎమ్ సుంకన్న, అబ్దుల్ హై యు శేషయ్య ప్రతాప్ రెడ్డి సాయి కృష్ణ తిప్పన్న నాయుడు ఎన్ సి బజారన్న, పోతుల శేఖర్ డబ్ల్యూ సత్యరాజు షేక్ ఖాజా హుస్సేన్, ఖాద్రీ భాష, ఎజాజ్ అహ్మద్, మాలిక్ భాష, వసిబాషా వసీం బాషా మద్దమ్మ మొదలగువారు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.