అంబిక శిశు కేంద్రం ను సందర్శించిన హై కోర్టు న్యాయమూర్తులు
న్యూస్ వెలుగు, కర్నూలు; అంబిక శిశు కేంద్రం నందు ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథులుగా డాక్టర్ జస్టిస్ కె. మన్మధ రావు, న్యాయమూర్తి, A.P. హైకోర్టు – కమ్ – కర్నూల్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, జస్టిస్ B.V.L.N.చక్రవర్తి, న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి , జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి బి. లీల వెంకట శేషాద్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కె. మన్మధ రావు, న్యాయమూర్తి మాట్లాడుతూ మానసిక దివ్యాంగుల అవసరార్థం అనేక చట్టాలు వున్నాయని వాటిని సరైన రీతిలో ఉపయోగించి సత్వర న్యాయం పొంద వచ్చునని తెలిపారు. మానసిక దివ్యాంగుల సంరక్షణ కొరకు స్నేహ పూర్వక న్యాయ సేవల పథకం 2005 గురించి వివరించారు. వీరందరికి ఉచిత న్యాయ సహాయం అందించబడుతుందని తెలియజేశారు. ట్రస్టీ వారు చేసే సేవ కార్యక్రమాలను కొనియాడురు. అనంతరం మానసిక దివ్యాంగులు వారు తయారు చేసే బ్యాగ్‌లు, బుక్ బైండింగ్, టైలరింగ్, ప్యాకింగ్, ప్రింటింగ్ మొదలైన నైపుణ్యాలను హై కోర్టు న్యాయమూర్తుల ముందు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జ్ లు జి.భూపాల్ రెడ్డి, పి.పాండురంగ రెడ్డి, రైస్ ఫాతిమా , అసిస్టెంట్ డైరెక్టర్, డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రాన్స్‌జెండర్ & సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, కర్నూలు & నంద్యాల జిల్లాలు, అంబికా శిశు కేంద్రం ట్రస్టీ శ్రీ దిలీప్ కుమార్ హెచ్.షా, హేమచంద్ దేవ్‌చంద్ ఛారిటీస్ ట్రస్ట్, V.R.P. శైలజా రావు, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.