హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్,  ట్రాకింగ్ అవగాహన

హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్,  ట్రాకింగ్ అవగాహన

న్యూస్ వెలుగు, కర్నూల్; కర్నూలు మెడికల్ కాలేజీ లెక్చరర్ గ్యాలరీలో హైరిస్క్ ప్రెగ్నెన్సి ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్  ట్రాకింగ్ పై పట్టణ /ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వార్డ్/గ్రామ మహిళా ఆరోగ్య కార్యకర్తలకు ఒక రోజు శిక్షణ కార్యక్రమము నిర్వహించినారు,ఈ శిక్షణలో జిల్లా వైద్య  ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ గర్భవతులు ఆరోగ్య కేంద్రానికి సందర్శించినప్పుడు ధీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు,షుగర్,కిడ్నీ వ్యాధులు, క్షయ,గుండె జబ్బులు,మూర్ఛ,హెపటైటీస్ –బి, మలేరియా జ్వరము,గతంలో గర్భములను కోల్పోవడము, కవల పిల్లలు,ప్రసూతికి సంబందించిన శస్త్ర చికిత్స , ప్రమాద చిహ్నాలుగల ప్రతి గర్భిణి చరిత్ర గురించి తప్పకుండా తెలుసుకొని మాతా శిశు సంరక్షణ కార్డులో పొందుపరచాలని ఈ విషయాలను వైద్యాధికారి దృష్టికి తీసుకొనివేళ్లాలని తెలియజేశారు. రాష్ట్ర స్థాయి శిక్షకులు డాక్టర్.ప్రియాంకా ,డాక్టర్.శివప్రసాద్ ,డాక్టర్.అను దీప్తి పవర్ పాయింట్ ప్రేసెంటేషన్ ద్వారా గర్భిణీల్లో ప్రమాదకర పరిస్థితులను ముందుగానే అంచనా వేసి క్షేత్రస్థాయి నుంచి రెఫెర్ చేసి స్పెసలిస్ట్ వైద్యుల స్థాయి వరకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్షుణ్ణoగా తెలియజేశారు.
ఈ కార్యక్రమములో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్.నాగప్రసాద్ ,DPMO డాక్టర్.ఉమా డి‌పి‌హెచ్‌ఎన్‌ఓ కే.అన్నపూర్ణ డి‌పి‌ఓ విజయ రాజు ప్రశాంత్ స్టేట్ ప్రోగ్రాం కొర్డినేటర్, డెమో శ్రీనివాసులు , ఎస్‌ఓ.హేమసుందరం , డిప్యూటీ డెమో చంద్రసేకర రెడ్డి ,పి‌హెచ్‌ఎన్ మీనాక్షి, , ఆరోగ్య విద్యా బోదకురాలు పద్మావతి , ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్, ఎం‌పి‌హెచ్‌ఈ‌ఓ శ్రీనివాస మూర్తి మరియు ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!