ప్రారంభమైన హోలీ సంబరాలు
మండల కేంద్రంలో నేటికి కొనసాగుతున్న కర్ణాటక జానపద కార్యక్రమం.
వారం రోజుల పాటు హాస్య సన్నివేశాలతో అలరించనున్న చిన్నారులు,యువకులు. 
హోళగుంద, న్యూస్ వెలుగు: రాష్ట్ర సరిహద్దు మండలంలో కర్ణాటక జానపద సాంస్కృతిక కార్యక్రమాలు నేటికి కొనసాగుతున్నాయి.శుక్రవారం మండల కేంద్రంలో హొలీ సంబరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
 సాయంత్రం ఈ రమణీయమైన కార్యక్రమం శ్రీ ఉరవకొండ మహస్వాముల మఠం నుంచి మేళతళాలతో,బిరప్ప డోళ్ళు,తప్పేట,సకల వాయిద్యాలతో పురవిధుల గుండా యువకులు మహిళ వేషధారణలో కుంభోత్సవాని మోసుకొని ఊరేగింపుగా వేళ్ళారు.అనంతరం మఠం వద్ద చేరుకొని అక్కడ కమన్నకు బలిదానం,కామనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ముఖ్యంగా ఇక్కడి రైతన్నలు తమ పంటలు చేతికందిన తర్వాత ఇక్కడి ప్రజలు,యువకులు కలిసి కట్టుగా ఉత్సహంగా పాల్గొని ఆందోత్సవంతో ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ.ప్రతి రోజు ఒక్కొక్క రకమైన హాస్య సన్నివేశాలను వేసి వారం రోజుల పాటు ప్రదర్శించి ప్రజలను సంతోషింప చేస్తారు.ఆఖరి రోజు కామన దహనం ఇతర నాటకాలు,సన్నివేశాలతో ముగింపు ఉంటుందన్నారు.అలాగే 6వ రోజు ఏనుగు మీద కమన్నను ఉరేగించి,అర్థరాత్రి కామ దహన కార్యక్రమం నిర్వహిస్తారు.చివరి రోజున మృత దేహం ఊరేగింపు, వివాహ వేడుకల ఊరేగింపు,రంగుచెల్లుట(వసంతోత్సవంతో)కార్యక్రమం ముగుస్తుందని భక్తులు తెలిపారు.

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda