
పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి
ఇండ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఐదు లక్షలు మంజూరు చేయాలి
k.జగన్నాథం రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి డిమాండ్
న్యూస్ వెలుగు, కర్నూల్; భారత కమ్యూనిస్టు పార్టీ కర్నూలు నగర సమితి ఆధ్వర్యంలో నగరంలోని పేదలకు ఇంటి స్థలాలు
ఇవ్వాలని ఇంటి స్థలాలలో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు కే జగన్నాథం ఈరోజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సిపిఐ నగర సహాయ కార్యదర్శులు కామ్రేడ్ జి చంద్రశేఖర్ కామ్రేడ్ డి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన కే జగన్నాథం మాట్లాడుతూ కర్నూలు నగరంలోని పేదలకు గత 15 సంవత్సరాలుగా సొంత ఇల్లు లేక ఇంటి అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని అనేక పనుల పైన పిల్లల చదువుల కోసం గ్రామాలు వదిలి పట్టణం చేరుకొని గౌండ పని అమాలి పని మట్టి పని చేసుకుంటూ జీవనం చేస్తున్న పేదలకు ప్రభుత్వం చెప్పినట్టుగా రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అలాగే ఇసుక సిమెంటు స్టీలు ప్రభుత్వమే ఫ్రీగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు .అలాగే నగరంలో విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోతున్నది ట్రాఫిక్ సమస్యను పరిష్కారం కోసం ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టాలని అండర్ డ్రైనేజీ కాలువలు నిర్మాణం చేపట్టాలని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గత నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం చాలా సిగ్గుచేటని తక్షణమే జిల్లా కలెక్టర్ కలుగజేసుకొని మడుగుతున్న సమస్యలను పరిష్కారం కోసం కృషి చేయాలని లేని పక్షంలో పదో తారీకు ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు .ఈ రిలే నిరాహార దీక్షలో
రైతు కూలి సంఘం జిల్లా నాయకులు సుంకన్న కార్యవర్గ సభ్యులు ఎం బిసన్న ఏఐటియుసి నగర డిప్యూటీ కార్యదర్శి రామాంజనేయులు హోటల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పురుషోత్తం నాగేంద్ర రంగనాయకులు మహిళా సంఘం నాయకులు రబియా మున్ని దేవి బాయ్ ధనలక్ష్మి సిపిఐ నగర నాయకులు రామాంజనేయులు పాల్గొన్నారు ఈ దీక్షలకు మద్దతుగా వాల్మీకి సంఘం నాయకులు మహేష్ దీక్షలో కూర్చున్న మద్దతుగా పూలమాలవేసి సంఘీభావాన్ని తెలియజేశారు.