ధనాపురం, హొళగుంద డబుల్ రోడ్డు ఆశలు సజీవం

ధనాపురం, హొళగుంద డబుల్ రోడ్డు ఆశలు సజీవం

హోళగుంద, న్యూస్ వెలుగు;  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హొళగుంద మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకులు రాజ పంపన గౌడ గ్రీవెన్స్ లో ఆదోని, ధనాపురం,హొళగుంద రోడ్డు కోసం ఇచ్చిన ఫిర్యాదుకు కు స్పందనగా మంగళవారం విజయవాడ ( అమరావతి ) నుండి సమాచారం అందించిన రోడ్లు భవనాల శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ త్వరలోనే దనాపురం హొళగుంద రోడ్డు పనులు ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. స్పందన ఫిర్యాదుకు సమాధానంగా రాజా పంపనగౌడ్ కు ప్రతి జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి కనెక్టివిటీగా డబుల్ రోడ్డు ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్డిబి ప్రాజెక్టు కింద ఒకే ప్యాకేజీగా 14 రోడ్డు పనులను మంజూరు చేసిందని గతంలో రోడ్డు పనులను ప్రారంభించిన కాంట్రాక్టర్ బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో పనులు చేయకుండా ఆపివేశారని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రోడ్లపై ప్రత్యేకమైన దృష్టి సారించడంతో పాటు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారని త్వరలోనే పనులు మొదలవుతాయని పేర్కొన్నారు. కాంట్రాక్టర్కు పెండింగ్లో ఉన్నటువంటి అక్టోబర్ 16వ తేదీన ప్రభుత్వం చెల్లించడంతో పనులు మొదలు పెట్టడానికి మార్గం సుగమమైందని తెలియజేశారు. రాష్ట్ర ఉన్నతాధికారి స్పందించి సమాచారం అందించడంతో ధన్యవాదాలు తెలిపిన రాజా పంపన గౌడ్ అధికారితో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మారుమూల మండలమైన హొళగుందకు రోడ్డు లేక ప్రజల ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నోసార్లు సంబంధిత అధికారులకు నాయకులకు వినతి పత్రాలు సమర్పించామని మండలానికి రోడ్డు అవసరం ఎంతో ఉందని రోడ్డు లేకపోవడంతో అన్ని రంగాలలో మండలం వెనకబడిపోయిందని తెలియజేశారు. ప్రజావసరాల కోసం గ్రామస్తులలో చైతన్యం అభినందనీయమని తెలియజేసిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ పనులు మొదలు పెట్టడానికి అనుకూలమైన డిసెంబర్ నెలలోనే ధనాపురం హొళగుంద రోడ్డు పనులు మొదలుకానున్నట్లు తెలియజేయడంతో రహదారి ఆశలు సజీవంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!